Breaking News

రైతుల దీక్ష ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర నాయకుడు పి.జంగారెడ్డి


సిపిఎం రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి మాట్లాడుతూ అనాజ్ పూర్ గ్రామ రైతులు చేస్తున్న సీలింగ్ పోరాటం న్యాయమైన పోరాటం అని వారి తరపున అధికారులు సానుకూలంగా స్పందించి వారి సమస్యలు పరిష్కారం చేయాలని రైతుల నోట్లో మట్టి కోట్టోదని ఆయన అన్నారు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం అధికారంలో లేవు అని ఆయన అన్నారు రైతులకు సీలింగ్ పట్టాలు ఊరికే రాలేదని ఆనాడు ఎన్నో ఉద్యమాలు జరిపితే వచ్చాయని తెలిపారు సెత్వారులో రైతుల పేర్లు వస్తున్న ఆన్ లైన్ లో చేర్చకుండా ఉండటం సరికాదని ఆయన అన్నారు ప్రభుత్వం స్పందించే వరకు మీ పోరాటానికి అండదండగా ఎర్రజెండా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముత్యాలు, జంగయ్య, బాలరాజు, మహేష్ రైతులు బిక్షపతి,రవి, రాములు, శివ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

                        

దసరా కానుక అందజేసిన వాకర్స్ క్లబ్