

హైదరాబాద్, శేరిలింగంపల్లి అక్టోబర్ 01, (తొలివార్త)
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి డివిజన్, ఖజాగూడలోని మలకంచెరువు పార్క్ లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మరియు సెక్యూరిటీ సిబ్బంది కి దసరా కానుకను అందజేసిన వాకర్స్ క్లబ్ సభ్యులు.నగదు ప్రతి నిత్యం పార్కును శుబ్రంగా ఉంచుతున్న పారిశుద్ధకార్మికులకు, పార్కుకు నిరంతరం రక్షణ కల్పిస్తున్న సెక్యూరిటీకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ 9000 రూపాయల నగదును దసరా కానుకగా అందజేశారు. కారక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు ప్రభాకర్ , సతీష్ గౌడ్ ,బాబ్జి , మల్లిఖార్జున్ , రామ్ రెడ్డి , సత్యనారాయణ , జ్ఞానేశ్వర్ , కృష్ణ , ప్రసాద్ మరియు తదితరులు పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలిపారు.