Breaking News

హెపటైటిస్-బి వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి: జిల్లా వైద్యాధికారి డా. మనోహర్

టీకా వేయించుకుంటున్న ఆరోగ్య సిబ్బంది

టీకా ప్రాముఖ్యత గురించి వైద్య సిబ్బందికి వివరిస్తున్న జిల్లా వైద్య అధికారి

దసరా కానుక అందజేసిన వాకర్స్ క్లబ్

ఆలేరు, సెప్టెంబర్ 11(తొలి వార్త):
జిల్లాలో పనిచేస్తున్న వైద్య మరియు ఆరోగ్యశాఖ సిబ్బంది అందరూ తప్పనిసరిగా హెపటైటిస్-బి వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు.గురువారం ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ( సిహెచ్సి) లో నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం లో భాగంగా హెల్త్ కేర్ వర్కర్లకు హెపటైటిస్-బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. మనోహర్ మాట్లాడుతూ ఆరోగ్యశాఖ సిబ్బంది విధుల్లో భాగంగా అనుకోకుండా కలుషిత వ్యర్థాలు, సిరంజిలు, ఆసుపత్రి సామాగ్రి వంటివి తాకే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దింతో వారు హెపటైటిస్-బి బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ వ్యాధి సోకితే కాలేయ సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్క సిబ్బంది ముందస్తుగా హెపటైటిస్-బి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అని సిబ్బందికి సూచించారు.
జిల్లాలో మొట్టమొదటగా ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలో మిగతా అన్ని ఆసుపత్రులలో కూడా సిబ్బందికి ఈ వ్యాక్సినేషన్ అందజేస్తామని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ మొత్తం మూడు డోసులుగా ఉంటుందని, మొదటిది జీరో డోస్, మిగతా రెండు డోసులను కూడా నిర్దేశిత సమయానికి తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం పర్యవేక్షణ అధికారి డా. సాయి శోభ మాట్లాడుతూ హెల్త్ వర్కర్లలో ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెంట్ డా. స్వప్న రాథోడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. యశోద, ఇమ్యునైజేషన్ అధికారి డా. రామకృష్ణ, ప్రోగ్రాం అధికారిణి డా. ఏ. వీణ, జిల్లా ఎపిడిమాలజిస్ట్ నర్సింహా, హెచ్‌ఇఓ యాకయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ బోనగిరి సత్యనారాయణ, ఇతర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు