
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 11
(తొలివార్త) జిల్లా ప్రతినిధి
గుండాల మండలంలోని వస్తా కొండూర్ గ్రామంలో పనిచేస్తున్న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన జంపాల రాజు కు ఐసిడిఎస్ సూపర్వైజర్ షమీం బేగం సిబ్బంది గురువారం ఐసిడిఎస్ సెంటర్లో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సెమీబీ మాట్లాడుతూ వృత్తి పట్ల గౌరవం బాధ్యత ఉన్నప్పుడే ఇలాంటి పురస్కారాలు వస్తాయని జిల్లాస్థాయి పురస్కారం లభించడం సంతోషకర మనీ అన్నారు ఇందులో భాగంగా అంగన్వాడి పాఠశాల లో మౌలిక వసతులు కల్పించాలని అడిగిన వెంటనే స్పందించి పాఠశాలలో ఫ్యాను ట్యూబ్ లైట్ ఫిట్ చేయించడం జరిగిందని దాతలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పాఠశాల అభివృద్ధి కోసం గ్రామస్తులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వస్తా కొండూరు గ్రామ ఆవాస అంగన్వాడీ టీచర్లు లింగాల పద్మ, యాట రమ, మాద రాజమణి తదితరులు పాల్గొన్నారు