Breaking News

జర్నలిస్టుల సమస్యల సాధనకు నిరంతరం పోరాటం

టి డబ్ల్యూ జె ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. సైదులు        

రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మన్ సిహెచ్ సురేష్


                             

నాగోల్ 10 సెప్టెంబర్ (తొలివార్త )

జర్నలిస్టుల సమస్యల సాధన కోసం టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తామని రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.సైదులు, రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మన్ సురేష్ లు స్పష్టం చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన ఎల్బీనగర్ నియోజకవర్గం టిడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లోకార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి సంఘం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యతతో ముందుకు సాగాలని, సమస్యల పరిష్కారం కోసం పోరాట పంథానే మార్గమని వారు పిలుపునిచ్చారు.
గుర్తింపు కార్డుల జారీని సులభతరం చేయడం
జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు, ఇన్షూరెన్స్ సదుపాయం కల్పించడం
ఆకస్మిక ప్రమాదాల బారిన పడ్డ జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం
నిరుపేద జర్నలిస్టుల కోసం గృహ వసతి, పెన్షన్ పథకాలు అమలు చేయడం
విధి నిర్వహణలో జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టబద్ధ రక్షణ కల్పించడం లాంటి జర్నలిస్టుల ప్రధాన డిమాండ్ల సాధించేందుకు
టిడబ్ల్యూజేఎఫ్ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని వారు హామీ ఇచ్చారు.
అనంతరం టి డబ్ల్యూ జే ఎఫ్ ఎల్ బి నగర్ నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా రుద్రాల శ్రీరాములు దిశ రిపోర్టర్, ప్రధాన కార్యదర్శిగా అయినేని. భగవంతురావు నవ తెలంగాణ, కోశాధికారిగా ఎన్  పర్వతాలు, ఉపాధ్యక్షులుగా రావుల నాగరాజు, రషీద్, డి. మహేష్  హస్తినాపురం,
సహాయ కార్యదర్శులు గా వెంకట్ రాములు, సుంకోజు నరసింహ చారి, శ్రీనివాస్ నేత, అడ్వైజజర్  సేగ్గేం కిరణ్, జిల్లా కమిటీ సభ్యులుగా సానెం శ్రీనివాస్ గౌడ్, పైల అశోక్ , రాష్ట్ర కమిటీ సభ్యులుగా పొట్లపల్లి అశోక్ గౌడ్ లను ఎన్నుకున్నారు.
ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల కు జిల్లా కార్యదర్శి సైదులు మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మన్ సురేష్ సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ లు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

దసరా కానుక అందజేసిన వాకర్స్ క్లబ్