
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం సెప్టెంబర్ 23 (తొలి వార్త)
అశ్వాపురం మండలంలో వివిధ గ్రామ పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పారిశుద్ధం కార్మికుల బకాయి జీతాలను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అశ్వాపురం బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ యుజన మండల అధ్యక్షుడు గద్దల రామ కృష్ణ డిమాండ్ చేశారు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామ కార్మికులు వాళ్ల ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాలలోని ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలని గ్రామాలలో చెత్తలను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ డ్రైనేజీ మురికి కాలువలను ఎప్పటికప్పుడు సుభ్రపరుస్తున్నా వాళ్ళ కష్టా లను గుర్తించి కార్మికులు చేస్తున్న పనులను బట్టి రావలసిన ప్రతి నెల వేతనాలు ఐదు నెలల నుండి బకాయి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు గ్రామ కార్మికులకు ఇంతవరకు చెల్లించకపోవడం సరైన పద్ధతి కాదని అన్నారు పంచాయతీలలో ఎక్కువగా పని చేస్తున్నవారు గ్రామ కార్మికులు బడుగు బలహీన వర్గాల వాళ్లు గిరిజన మారుమూల గ్రామాలలో ఆదివాసులు పారిశుద్ధం కార్మికులు విధులు నిర్వహిస్తుంటారు వాళ్లకు చాలి చాలనీ జీతభత్యాలతో కుటుంబాలను పోషించుకుంటారని కార్మికులు విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రమాదం సంభవిస్తే 25 లక్షలు ఎక్స్గ్రేయ ప్రభుత్వం చెల్లించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలి 51 జీవో ను రద్దు చేయాలి జిల్లాలో ఆన్లైన్లో పేరు లేని వారిని ఆన్లైన్లో పేర్లు చేయించాలి 2011 జనాభా ప్రకారం కాకుండా ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం కార్మిక సిబ్బందిని నియమించాలి ప్రతి నెల కార్మికుల వేతనాలు చెల్లించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని కోరారు దసరా పండుగ సందర్భంగా వేతనాలు విడుదల చేసి వారి కుటుంబాలు అందరితో పాటు పండుగను జరుపుకునే విధంగా చూడాలని లేనిపక్షంలో కార్మిక కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వ సంబంధిత అధికారులు వెంటనే కార్మిక కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు