
హైదరాబాద్: సెప్టెంబర్ 9:(తొలి వార్త)
భుజానా సంచి వేసుకుని, నా గొడవంతా ప్రజా గొడవే నని ప్రకటించిన తెలంగాణా ఉద్యమ కవి కాళోజి నారాయణ రావు అని మోత్కూర్ డవలప్ మెంట్ ఫోరమ్ అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మ చారి అన్నారు. ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవం సందర్బంగా శాఖా గ్రంథాలయంలో కాళోజి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పోరాటాలకు స్ఫూర్తి శిఖరంగా నిలిచిన కాళోజి బాటలోనేటి యువత, ప్రతీ ఒక్కరూ పయనించాలని కోరారు. తెలంగాణా భాషా దినోత్సవం సందర్బంగా కవితను వినిపించారు. ఈ కార్యక్రమంలోఫోరమ్ ప్రధాన కార్యదర్శి కలిమేల నర్సయ్య, కాళోజి అభిమానులు అవిశెట్టి అవిలుమల్లు,పోలీనేని స్వామిరాయుడు,కోమటి మత్స్య గిరి, మర్రి ఆనందం, మోత్కుర్ జయ ప్రసాద్, చేతరాశి వెంకన్న, కొణతం సత్తయ్య,కోమటి జనార్ధన్, చిలకమర్రి బాబు చారి, కొయ్యలకారి జహంగీర్ షర్ఫో ద్ధిన్ తదితరులు పాల్గొన్నారు