



యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 11
(తొలి వార్త) జిల్లా ప్రతినిధి
ఆలేరు పట్టణంలోని రంగనాయకుల ఆలయం, బ్రహ్మంగారి ఆలయం, 11, 12 వ వార్డులో సమీపంలో ఉన్న బైరామ్ కుంట తెగిపోవటం వల్ల ఇల్లు నీట మునిగిపోవటం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆ నీట మునిగిన ప్రాంతంలో సందర్శించారు.పలు ఇళ్లల్లో ఉన్న ప్రజలను మందలించి వారి పరిస్థితులను తెలుసుకున్నారు అధికారులు అందరినీ అప్రమంతం చేసి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అవసరమైతే వారిని వేరే ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసి వీరికి రెండు మూడు రోజులపాటు కావలసిన ఆహార పదార్థాలను అందజేయాలని తెలిపారు
కొన్ని ప్రాంతాలలో నీళ్లు సులువుగా వెళ్లేందుకు జెసిబి సహాయంతో కాలువను తీయించారు, ఆలేరు పట్టణంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. సహ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అశోక్ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అట్లాగే జనగాం ఉపేందర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రజలకు చేయూతనందించారు