Breaking News

నారాయణ పాఠశాల ఓ సి ఎల్ బి ఎన్ చింతలకుంట శాఖలో కృష్ణాష్టమి వేడుకలు

ఎల్.బి.నగర్,ఆగస్టు 14(తొలివార్త): నారాయణ పాఠశాల ఓ సి ఎల్ బి ఎన్ చింతలకుంట శాఖ నందు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను విద్యార్థినీ,విద్యార్థులు ఎంతో శ్రద్ధాసక్తులతో,భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు.విద్యార్థుల ఉత్సాహం,ఉపాధ్యాయినులు సృజనాత్మకతతో రూపొందించిన కృష్ణుని అలంకరణ శోభ ఈ ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి.ఈ వేడుకను పురస్కరించుకొని బాలకృష్ణుల వేషధారణ
పోటీలు,రాధా కృష్ణ నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది.చిన్న పిల్లలు శ్రీకృష్ణుడిగా,రాధలాగా,గోపికల్లా ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు.శ్రీకృష్ణుని జీవితం మనందరికీ మార్గదర్శకమైనదని,ఇలాంటి పండుగలు విద్యార్థుల్లో భక్తి భావం,నైతికత,సాంస్కృతిక ప్రాధాన్యతను పెంచుతాయి అని ప్రధానోపాధ్యాయిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.ఈ కార్యక్రమానికి జి ఎం గోపాల్ రెడ్డి,ఎ జి ఎం హేమాంబర్,ఆర్ ఐ రవి ప్రసాద్,కో ఆర్డినేటర్ గాయత్రి, మహేశ్వరి,ఆర్ అండ్ డి టీమ్,ప్రిన్సిపాల్ రాజ రాజేశ్వరి దేవి,అకాడమిక్ డీన్ లావణ్య ,ఎ ఒ ఫణి, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత,ఉపాధ్యాయ ఉపాధ్యాయినీ బృందం పాల్గొన్నారు.

ఎం. ఆర్ బేకర్స్ ఘనంగా ప్రారంభోత్సవం