శంకర్‌పల్లి: నవంబర్ 20: తొలివార్త : విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా
ఉండాలని శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ కోరారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలతో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్ను కోల్పోతున్నారన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితిలో వాహనాలు నడపరాదని తెలిపారు. పాఠశాలలో ర్యాగింగ్ చేయరాదని హెచ్చరించారు. ఎస్ఐ సుందరయ్య మాట్లాడుతూ యువత దురలవాట్లకు లోనుకాకుండా పట్టుదలతో చదవాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శోభారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
