Breaking News

రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

లడ్డు వేలం లో అప్పల సోమశేఖర్ రెడ్డి, అప్పల సునీత దంపతులు రూ. 71116/- దక్కించుకున్నారు.

మీర్పేట్, సెప్టెంబర్ 07,(తొలివార్త): మీర్పేట్ రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  శనివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో 1500 మంది కి పైగా భక్తులు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్బంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలు గా రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని,ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువ ఘనంగా ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు.గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో  పాడిపంటలతో సంతోషంగా ఉండాలని వారు కోరారు. ప్రజలందరూ దైవ సన్మార్గంలో నడిచినట్లయితే శాంతి ముక్తి మార్గం లభిస్తుందని  తెలిపారు.అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదని అన్నదాతలకు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ భక్తి శ్రద్దలతో సంతోషంగా పండగ జరుపుకోవాలని కోరారు. ఈ గణనాథని పండుగలో ముఖ్యంగా యువత ముందుండి పండగలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.కులమతాలకు అతీతంగా వినాయక పండుగ జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.అనంతరం లడ్డు వేలం పాట నిర్వహించారు. నవరాత్రులు పూజలు అందుకొని గణనాథుని చెంత నిష్టతో ఉన్న లడ్డును అప్పల సోమశేఖర్ రెడ్డి, అప్పల సునీత దంపతులు రూ. 71116/- దక్కించుకున్నారు.గత సంవత్సరం కూడా వీరే లడ్డును దక్కించుకోవడం విశేషం.ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గణనాథుని లడ్డును వేలం పాటలో దగ్గించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఎంతో పవిత్రతతో,గణనాథుని వద్ద తొమ్మిది రోజులు పూజలందుకొని నిష్టతో కూడుకొని ఉంటుందని లడ్డూని తీసుకున్న వారికి గణనాథుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని వారు ఈ సందర్భంగా దీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సరోజ,వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, కోశాధికారి రాజేశ్వర్ రెడ్డి,జనరల్ సెక్రెటరీ మంజుల,ఆర్గనైజింగ్ సెక్రటరీ రేణుక, అన్నదాతలు సోమశేఖర్ రెడ్డి-సునీత, గోవర్ధన్ రెడ్డి- రమ, కల్లేపల్లి రామలింగయ్య – రాజేశ్వరి,అట్ల అశోక్ కుమార్ రెడ్డి, అట్ల శ్రీ కీర్తన, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

దసరా కానుక అందజేసిన వాకర్స్ క్లబ్