
తుంగతుర్తి, సెప్టెంబర్ 01 (తొలి వార్త)
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారం లోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల లో భోజన విరామ సమయం లో నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా జాక్టో ఆధ్వర్యం లోనల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాక్టో నాయకులు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో జాక్టో నాయకులు కడపర్తి శ్రీనివాస్ నాయుడు, బంధం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు దేవా, వెంకట్ రాములు, కోటయ్య, సుజాత, ఉమారాణి, గీత లు పాల్గొన్నారు.