చేసే ప్రభుత్వాలను చేయనీయండి
మీకు చేతనైతే దేశవ్యాప్తంగా జనగణనలో కులగణను చేర్చి కులాల లెక్కలు తీయండి…….
బీసీ కులగణనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీసీ సంఘాల నేతలు..
కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్
కార్యనిర్వాక అధ్యక్షులు
బీసీ సంక్షేమ సంఘం
తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ప్రారంభమైన నేపథ్యంలో బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కులగణనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీలకు వెంటనే అయన క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కుల గణన మొదలుపెడితే, బీజేపీ నాయకులు ఓర్వలేనితనంతో బీసీలను ఇంకా ఓట్లు వేసే యంత్రాలు గాని చూడాలని బిజెపి నేతలు, పూటకొకరు కులగణన పై విషం కక్కుతూ అడ్డుపడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదని.
కులగణన ఒక యజ్ఞం లా సాగుతుంటే దానిని రాజకీయ రంగు పులిమి మద్యంతరంగా అడ్డుకోవాలని చూస్తున్నటువంటి రాజకీయ నాయకులను భరతం పడతామని, వారి పార్టీలకు పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు,
కులగణన సర్వే బీసీల తలరాతలు మార్చే విధంగా వారి లెక్కలు వారు తెలుసుకునే విధంగా సర్వే కొనసాగుతుంటే కొంతమంది లేనిపోని అబండాలు వేసి ఆ సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులను రాష్ట్ర బహిష్కరణ చేయాల్సి వస్తుందని, మెజారిటీ కులాలకు అధికారం కోసం కులగణన ఉపయోగపడుతుందని వారి పీఠాలు ఎక్కడ కదులుతాయోనని భయపడుతూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం దక్కకుండా అన్ని రాజకీయ పార్టీలలోని కొంతమంది పెత్తందారులు దీని అడ్డుకోవాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన కులగణను ఆగదని దానిని నిర్వహించి మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడుతామని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాదేశి రాజేందర్, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నరసింహ నాయక్, అర్జున్, గుంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు..
*కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్*
కార్యనిర్వహక అధ్యక్షులు
బీసీ సంక్షేమ సంఘం
తెలంగాణ రాష్ట్రం