IND vs SA T20 సిరీస్ 2024: టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా జట్లు నాలుగు టీ20 మ్యాచుల సిరీస్‌లో తలపడనున్నాయి. నవంబర్ 8వ తేదీన డర్బన్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది. సఫారీల సొంతగడ్డపై భారత యువ జట్టు తొలిసారి సవాలు ఎదుర్కోనుంది, అంతేకాకుండా ఇది టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లకు దక్షిణాఫ్రికాలో తొలి పర్యటన కావడం గమనార్హం.
సూర్యకుమార్ యాదవ్
2021లో టీ20ల్లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ దక్షిణాఫ్రికాపై సాధించిన రికార్డులను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. 346 పరుగులతో రెండో స్థానంలో ఉన్న సూర్యకు డేవిడ్ మిల్లర్ రికార్డును అధిగమించడానికి కేవలం 107 పరుగులు కావాలి.
150 సిక్స్‌ల రికార్డు
సూర్య ఇప్పటివరకు 144 సిక్సర్లు కొట్టాడు. మరో 6 సిక్సర్లు కొడితే టీ20ల్లో అత్యంత వేగంగా 150 సిక్సులు బాదిన ఆటగాడిగా నిలుస్తాడు.
హార్దిక్ పాండ్య
2016లో టీ20ల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్య ఇప్పటివరకు 87 వికెట్లు తీసాడు. యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్ల రికార్డు అధిగమించడానికి పాండ్యకు 10 వికెట్లు మాత్రమే అవసరం.
అర్ష్‌దీప్ సింగ్
అర్ష్‌దీప్ సింగ్ 2022లో టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 87 వికెట్లు సాధించిన అతను కూడా చాహల్ రికార్డుకు 10 వికెట్ల దూరంలో ఉన్నాడు. 2024 ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ 19 వికెట్లు తీసి, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (17) తీసిన బౌలర్‌గా నిలిచాడు.
భారత జట్టు సభ్యులు:
సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్.