Breaking News

సైబర్ అలర్ట్ – సమగ్ర కుటుంబ సర్వే పై మోసాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే పై సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ సర్వే ఆధారంగా పత్రాలు పంపాలని లేదా సమాచారాన్ని అందించాలని చెప్పి ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాల్ చేసి, ఆధార్, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లు పంపాలని, లేకపోతే సర్వే లింకులను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచిస్తూ, నేరగాళ్లు మోసాలు చేయడంలో నిమగ్నమయ్యారు.

ముఖ్యమైన సూచనలు:

  1. సర్వే సిబ్బంది ఎలాంటి పత్రాలు తీసుకోరు.
  2. ధృవీకరణ పత్రాలుఫోటోలుకెమెరా వాడకాలు లేదా ఆధార్ అనుసంధానం చేసే ఏ ఆపరేషన్లు జరుగవు.
  3. సర్వే సిబ్బంది నేరుగా మీ ఇంటికి రాకుండా వివరాలు నమోదు చేయరు.
  4. సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకండి.
  5. పొరపాటున క్లిక్ చేసేవారైతే, వారి ఫోన్‌లో ప్రమాదకరమైన యాప్‌లు డౌన్‌లోడ్ అవుతాయి, దీనితో బ్యాంకు ఖాతాలు, ఫొటోలు దొంగిలించబడే అవకాశం ఉంటుంది.
  6. మోసం జరిగితే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.

సాధారణ గమనిక:
సర్వే సిబ్బంది ఎప్పటికీ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, ఫోన్ లేదా లింకులు వాడి వేరే పత్రాలు అడగరు.

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.