కుకట్‌పల్లి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిలవడంతో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు కింద పడుతున్నారు.

గత నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉందని, అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.