విశాఖపట్నంలో కొత్త ఐటీ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
పార్క్ పూర్తయితే సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. స్థానిక యువతకు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పారు.

