ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. విజయవాడ వద్ద బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నది పరీవాహక ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు.
వరద పరిస్థితిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.




