ఉప్పల్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 33 జిల్లాల నుంచి బాలురు, బాలికల విభాగాల్లో 60 జట్లు పాల్గొంటున్నాయి.
మొదటి రోజు జరిగిన మ్యాచ్‌లను చూసేందుకు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు తరలివచ్చారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారు.




