ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో 1,200 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 1 నుంచి 21 వరకు స్వీకరిస్తారు.

జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని, దళారుల మాటలు నమ్మవద్దని అధికారులు సూచించారు.