నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.