ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం వరంగల్ జిల్లాలో 180 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

తేమ శాతం 17 లోపు ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని రైతులకు సూచించారు. చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.

గోనె సంచుల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని, ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు.