మేడిపల్లి అక్టోబర్ 17(తొలివార్త)
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని వరంగల్ ప్రధాన రహదారిలో మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ బిక్షం రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుప్పల్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, పీర్జాదిగూడ మాజీ కార్పొరేటర్ కౌడే పోచయ్య, భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పాల్గొని ప్రగతి చిట్ ఫండ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు అత్యుత్తమ చిట్ఫండ్ సేవలు అందిస్తూ, వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెందాలని, వచ్చే దసరా పండగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి చిట్ ఫండ్ బ్రాంచీలు ఏర్పాటు చేయాలని సింగిరెడ్డి పద్మారెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




