న్యూ ఢిల్లీ 15 అక్టోబర్ (తొలివార్త )

న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ ) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ శ్రీ మధుయాష్కి గౌడ్ అన్నని కలిసి దాము మహేందర్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ కి అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని, దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేస్తూ ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.దాము మహేందర్ యాదవ్ అధికార ప్రతినిధి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ