
చైతన్యపురి 14 అక్టోబర్ (తొలివార్త )
అట్టహాసంగా ప్రారంభమైన ఈ కొత్త స్టోర్‌తో హైదరాబాద్‌లో బ్రాండ్ మరింత బలపడింది. దీంతో కలిపి నాలుగు రాష్ట్రాల్లోని పీఎంజే రీటైల్ నెట్వర్క్ స్టోర్ల సంఖ్య 47కి చేరింది.
హైదరాబాద్, అక్టోబర్ 14, 2026న అద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి, కాలాతీత అందాలకు ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెలర్స్, హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, చైతన్యపురిలో కొత్త స్టోర్‌ను ఘనంగా ప్రారంభించినట్లు ఇవాళ ప్రకటించింది. పీఎంజే జ్యువెలర్స్ తెలంగాణ క్లస్టర్ హెడ్ దీపక్, చైతన్యపురి స్టోర్ మేనేజర్ మధన్ కుమార్ మరియు పీఎంజే జ్యువెలర్స్ కస్టమర్ల సమక్షంలో ఈ స్టోర్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంతో పీఎంజే జ్యువెలర్స్ తన రిటైల్ ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. దీనితో భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ స్టోర్ల సంఖ్య 47కి చేరింది.
కొత్తగా డిజైన్ చేసిన ఈ స్టోర్, సాంప్రదాయ నైపుణ్యాన్ని ఆధునిక సౌందర్యంతో మిళితం చేసి, కస్టమర్లకు ఒక అద్భుతమైన ఆభరణాల కొనుగోలు అనుభవాన్ని అందిస్తోంది. ఇక్కడ హ్యాండ్‌క్రాఫ్టెడ్ జ్యువెలరీ భారీ కలెక్షన్ అందుబాటులో ఉంది. ఇందులో టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ గోల్డ్ నెక్లెస్‌లు, వడ్డాణాలు, బ్రైడల్ జ్యువెలరీ సెట్లు, హాఫ్-చీర మరియు అకేషన్-వేర్ ఆభరణాలు, డైమండ్ జ్యువెలరీతో పాటు రంగురంగుల రత్నాలతో తయారు చేసిన అలంకరణలు ఉన్నాయి. అంతేకాకుండా, కుందన్, పోల్కి, జడవు స్టైల్స్‌తో పాటు రోజువారీ ధరించే తేలికపాటి నెక్లెస్‌లు, ఇయర్రింగ్స్ మరియు రింగుల విస్తృత శ్రేణిని కూడా కస్టమర్లు పరిశీలించవచ్చు.
ఈ కొత్త స్టోర్ ప్రారంభం గురించి పీఎంజే జ్యువెలర్స్ సీఈఓ కిరణ్ షిండే మాట్లాడుతూ, "చైతన్యపురిలోని మా కొత్త స్టోర్‌తో నాలుగు రాష్ట్రాల్లో పీఎంజే జ్యువెలర్స్ స్టోర్ల సంఖ్య 47కి చేరింది. గత 60 ఏళ్లుగా కాలాతీత హస్తకళా నైపుణ్యం కోసం కస్టమర్లు మాపై నమ్మకం ఉంచుతున్నారు. ఆ వారసత్వాన్ని మరియు వ్యక్తిగత షాపింగ్ అనుభవాన్ని దిల్సుఖ్నగర్ ప్రాంత కుటుంబాలకు మరింత దగ్గర చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కొత్త స్టోర్ సాంప్రదాయ కళను, ఆధునిక డిజైన్‌ను ఏకం చేస్తూ.. నాణ్యత, పారదర్శకత మరియు తరతరాలుగా కస్టమర్లు మా బ్రాండ్‌పై ఉంచిన నమ్మకానికి అద్దం పడుతోంది" అని తెలిపారు.
ఈ సందర్భంగా పీఎంజే జ్యువెలర్స్ తెలంగాణ క్లస్టర్ హెడ్ శ్రీ దీపక్ మాట్లాడుతూ, "మా చైతన్యపురి స్టోర్ గ్రాండ్ లాంచ్‌ను ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి క్షణం అందాన్ని ప్రతిబింబించే కాలాతీత ఆభరణాలను రూపొందించడానికే పీఎంజే జ్యువెలర్స్ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. మా కొత్త స్టోర్ ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. అసాధారణమైన హస్తకళా నైపుణ్యం, సమకాలీన డిజైన్లు మరియు తరతరాలుగా మా బ్రాండ్‌పై కస్టమర్లు ఉంచిన నమ్మకాన్ని ఇది ఒకచోట చేర్చుతుంది" అని తెలిపారు.
చైతన్యపురి స్టోర్ మేనేజర్ శ్రీ మధన్ కుమార్ మాట్లాడుతూ, "మా తాజా క్రియెషన్స్ను కొత్త స్టోర్‌లో ఆవిష్కరిస్తున్న తరుణంలో, పీఎంజే జ్యువెలర్స్ ప్రత్యేకతను చాటే అద్భుతమైన డిజైన్లను పరిశీలించాల్సిందిగా మా కస్టమర్లను ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఆభరణం వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. వివాహాలు, కుటుంబ వేడుకల నుంచి ప్రతి చిన్న మైలురాయి వరకు మా కస్టమర్ల ప్రత్యేక క్షణాల్లో భాగం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.
చైతన్యపురిలో పిఎంజే జ్యువెలర్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కస్టమర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న ఈ బ్రాండ్ వారసత్వాన్ని, సాంప్రదాయ కళను కాపాడుతూ వస్తున్న నిబద్ధతను, కాలాతీత డిజైన్లను ఆధునిక సౌందర్యంతో తీర్చిదిద్దే ప్రతిభను వారు కొనియాడారు. నాణ్యత, నమ్మకం మరియు కస్టమర్లతో సార్థకమైన బంధాన్ని కొనసాగించడంలో పీఎంజే జ్యువెలర్స్ చూపుతున్న అంకితభావాన్ని ఈ కొత్త స్టోర్ ప్రతిబింబిస్తోందని వారు పేర్కొన్నారు.
60 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పీఎంజే జ్యువెలర్స్, అత్యుత్తమ లగ్జరీ ఫైన్ జ్యువెలరీ బ్రాండ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శాశ్వతమైన నాణ్యత, వ్యక్తిగత సేవలు మరియు ప్రత్యేకమైన ఆభరణాలు కోరుకునే కస్టమర్లకు నిపుణుల మార్గదర్శకత్వం అందించడంలో ఇది ప్రసిద్ధి చెందింది. ఈ బ్రాండ్ విస్తృత శ్రేణితో కూడిన డైమండ్ వెడ్డింగ్ జ్యువెలరీని అందిస్తోంది. తరతరాలుగా కుటుంబాల్లో ప్రత్యేక జ్ఞాపకాలుగా నిలిచిపోయేలా ప్రతి ఆభరణాన్ని ఎంతో సూక్ష్మంగా రూపొందిస్తారు.
నాణ్యత మరియు కస్టమర్ల నమ్మకానికి కట్టుబడి ఉన్న పీఎంజే జ్యువెలర్స్, తమ స్టోర్లలో డైమండ్ టెస్టింగ్ మెషీన్లను (DTMs) ఏర్పాటు చేయడం ద్వారా పారదర్శకతను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కస్టమర్లు డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు సరైన అవగాహనతో స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చు.
ప్రతి ఆభరణం అనుభవజ్ఞులైన కారిగర్ల (చేతివృత్తి నిపుణుల) నైపుణ్యాన్ని, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో సున్నితమైన హస్తకళా నైపుణ్యం, విశిష్టమైన డిజైన్ శైలి కలిసి ఉంటాయి. నాణ్యత, విలువ, హస్తకళా నైపుణ్యానికి సంబంధించి పీఎంజే భరోసా ప్రతి క్రియేషన్‌లోనూ కనిపిస్తుంది. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే మారుతున్న కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా ఆభరణాలను రూపొందించాలన్న బ్రాండ్ నిబద్ధతను ఇది మరింత బలపరుస్తోంది.
చైతన్యపురిలో ప్రారంభమైన ఈ కొత్త స్టోర్ పీఎంజే జ్యువెలర్స్ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. దీనిద్వారా ఈ బ్రాండ్‌కు చెందిన ప్రసిద్ధ కలెక్షన్లు, పర్సనలైజ్డ్ షాపింగ్ అనుభూతి దిల్సుఖ్నగర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల కస్టమర్లకు మరింత చేరువయ్యాయి.




