భద్రాద్రి జిల్లా అక్టోబర్ 10 (తొలి వార్త)
అశ్వాపురం మండల ప్రజలందరికీ అట్ల బతుకమ్మ, పర్వదిన,శుభాకాంక్షలు,తెలియజేస్తున్నట్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సర్పంచ్ ఏనిక ఉషారాణి పేర్కొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అశ్వాపురం మండల,వ్యాప్తంగా,ఆడపడుచులు,భక్తిశ్రద్ధలతో,సంప్రదాయబద్ధంగా,ఆనందోత్సాహాలతో,జరుపుకోవాలని,కోరుతూ ప్రకృతిని,పూజిస్తూ రంగురంగుల తీరొక్క పూలను అందంగా పేర్చి బతుకమ్మను కొలిచే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల, మహిళా సోదరీమణుల, ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అని ఉషారాణి తెలిపారు.అదేవిధంగా దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, సర్పంచ్ ఉషారాణి కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో,సుఖసంతోషాలుఆయురారోగ్యాలు,సిరిసంపదలు వెల్లివిరియాలని, మండల కాంగ్రెస్ పార్టీ, సీనియర్ నాయకురాలు, సర్పంచ్ ఏనిక ఉషారాణి ఆకాంక్షించారు.




