మణుగూరు అక్టోబర్ 9 (తొలి వార్త)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు మరియు పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ,శుభాకాంక్షలు,తెలియజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు,సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎస్టి సంక్షేమ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు.ప్రకృతిని పూజిస్తూ,పూలను అందంగా పేర్చి బతుకమ్మను కొలిచే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు.అదేవిధంగా దసరా నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో,సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,జిల్లా,ప్రజలకు,పిలుపునిచ్చారు.