హయత్ నగర్ 10 అక్టోబర్ (తొలివార్త )

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి,ప్రకృతితో మమేకమైన మన జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని పూలను పూజించే అపురూపమైన సంప్రదాయం బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని,తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈపండుగ ప్రతి ఇంటా సంతోషాలు,ప్రతి కుటుంబంలో సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.చెరువులు,ప్రకృతి వనరుల పరిరక్షణ ప్రాముఖ్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ మన సంస్కృతిని భావితరాలకు అందించే గొప్ప వారసత్వమని అన్నారు.

మహిళలు,యువతులు సంప్రదాయ దుస్తులుధరించి,రంగురంగులపూలతో బతుకమ్మలను పేర్చి,పాటలు పాడుతూ,ఆటలాడుతూ జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఐక్యతకు,మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుంది ఇట్టి గొప్ప పండుగని హయత్ నగర్ పరిధి లోని శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు మహిళలు ఘనంగా జరుపుకున్నారు