సమాజ అభివృద్ధి కి స్త్రీ అభివృద్ధి అవసరం
సమాజ అభివృద్ధి కి స్త్రీ అభివృద్ధి అవసరం

జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని న్యూ దిల్‌సుఖ్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో గత కొన్ని రోజులుగా నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ, బ్యూటీషియన్, మెహందీ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన మహిళా సోదరీమణులకు సర్టిఫికెట్లను ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు,ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి కమల సుధీర్ రెడ్డి గార్లు చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మహిళ చేతిలో నైపుణ్యం ఉంటే ఒక కుటుంబం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని, ఒక కుటుంబం ఎదిగితే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు

ఆర్థికంగా స్వావలంబన సాధించి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలనే లక్ష్యంతో జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ శిక్షణలో ప్రాథమిక స్థాయి నుంచి ఆధునిక కుట్టు నైపుణ్యాలతో పాటు బ్యూటీషియన్, మెహందీ వంటి ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే కోర్సుల్లో సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.

శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు, తమ కుటుంబ ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేసుకునే అవకాశం పొందుతారని అన్నారు.

మహిళల నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, యువ నాయకులు రెడ్డి,ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారస పార్టీ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి నాయుడు,నర్సిరెడ్డి,రాపోలు సుధాకర్,విశ్,శివాప్రకాష్,నాగలక్ష్మి,జయశ్రీ,శోభరాణి,భానుప్రియ,శివబిందు,అర్చన మరియు ట్రస్ట్ ప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,శిక్షణ పొందిన మహిళలు, తదితరులు పాల్గొన్నారు.