భువనగిరి, అక్టోబర్ 5 (తొలి వార్త)

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా సీఐ డి. వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణ టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్షులు పాములపర్తి లక్ష్మీనారాయణ సీఐ డి. వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీస్ శాఖ అందించే సేవలను మరింత చేరువ చేయడంలో సీఐ వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

భువనగిరి పట్టణంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు, నేరాలను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. బాధ్యతలు స్వీకరించిన సీఐ డి. వెంకటేశ్వర్లుకు జర్నలిస్టులు, ప్రజలు, వివిధ వర్గాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు