చౌటుప్పల్,అక్టోబర్09

(తొలివార్త)

చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలో అధికార ప్రతినిధిగా పీపల్ పహాడ్ గ్రామ ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తనను మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ బాధ్యత అప్పగించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.మండల కాంగ్రెస్ కమిటీలోఅధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందని,పార్టీ నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.అదేవిదంగా మునుగోడు నియోజకవర్గ నాయకులు,చౌటుప్పల్ మండల నాయకులు మరియు పీపల్ పహాడ్ గ్రామ సర్పంచ్ పులనాగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.