చుట్టుపక్కల కాలనీవాసులు అక్కడ ఉన్న లేబర్ వారితో మాట్లాడడం జరిగింది.ఈ సందర్బంగా చుట్టుప్రక్కల కాలనీవాసులు మాట్లాడుతూ ప్రతినిత్యం ఇట్టి లేబర్ అడ్డా వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అన్నారు.ఇక్కడే రోడ్డు మీద మూత్రవిసర్జన,పేకాట,రోడ్డు ప్రక్కన పడుకోవడం జరుగుతుంది అని దీని వల్ల అట్టి కాలనీలోకి వెళ్ళడానికి మహిళలు తదితరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని అన్నారు.కావున ఇట్టి అడ్డాను మరొక్కచోటుకు తరలించాలని కోరారు.అనంతరం సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ ఎన్నో సంవత్సరాలనుండి వీరు బ్రతుకులు వెల్లధీసుకుంటున్న నేపథ్యంలో వీరికి ప్రక్కన ఉన్న రేడియో స్టేషన్ దగ్గర ఉన్న ఫుట్ పాత్ దగ్గర అట్టి కార్మికులకు మూత్రశాలలు,మంచినీటి సౌకర్యం,సేద తిరడానికి ఒక షెడ్డు నిర్మిస్తామని సుధీర్ రెడ్డి గారు తెలిపారు.దానికి వారు అంగీకారం తెలియజేయడం జరిగింది.అలాగే స్థానిక ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ లేబర్ అడ్డా వారికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.అట్టి లేబర్ అడ్డా ప్రక్కకు తరలించినందుకు గాను చుట్టుపక్కల కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.ఇట్టి కార్యక్రమంలో మన్సురాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి,డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు చెన్నగోని శ్రీధర్ గౌడ్,గుత్త లక్ష్మారెడ్డి,దీపావళి శ్రీకాంత్ మరియు చుట్టుప్రక్కల పలు కాలనీ అధ్యక్ష,కార్యదర్శులు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
హయత్ నగర్ లేబర్(కార్మికుల)అడ్డాను పరిశీలించిన శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
Reader news · Not verified
Published: 736 views

This story is not yet available in English. Showing the Telugu original.
Get news alerts first — download the app
Breaking news from your district, straight to your phone.
