రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ స్వర్ణకుమారి ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. హైదరాబాదులోని ఓ కొత్త ఆసుపత్రిని ప్రారంభించేందుకు పర్మిషన్లు ఇవ్వడం కోసం డీఎంహెచ్‌వో లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి లంచం డబ్బులు తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.