భద్రాద్రి జిల్లా 09అక్టోబర్(తొలివార్త)

బూర్గంపాడు మండలంలో తెలంగాణ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, పాయం వెంకటేశ్వర్లు ఆర్ అండ్ బి, (రోడ్లు, భవనాల శాఖ) అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా,నియోజకవర్గంలోని రహదారుల పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిర్మాణంలో ఉన్న రహదారుల పురోగతి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట కొత్త రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను,కోరారు.ప్రభుత్వం మంజూరు చేసిన రహదారి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని,తెలిపారు.పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి పనుల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి,వాటి పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు.